ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో నూతనంగా శంకుస్థాపన చేసిన ఉగ్రనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజగౌడ, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆలయ పనులను త్వరత్వరగతిగా చెయ్యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆశీర్వాచన మండపంలో కండువాకప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, తహసిల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.