జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని అంగన్వాడి సెంటర్ 2 అంగన్వాడి సెంటర్ 3 లో అంగన్వాడి పోషణ మాసం ప్రోగ్రాం చేయడం జరిగింది. సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంటల వనజ శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి పద్మ, వార్డ్ మెంబర్స్, అంగన్వాడీ టీచర్లు అనిత, ఉమారాణి, ఆయా రాజ్యలక్ష్మి, ఆశా వర్కర్లు లక్ష్మి, మంగ, అంగన్వాడి పిల్లల తల్లులు పాల్గొన్నారు.