బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలో ప్రభుత్వ పథకాల పంపిణీలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమేయం లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రోటోకాల్ పాటించకుండా కొందరు వ్యక్తులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని మద్దునూర్ సర్పంచ్ గాలిపెల్లి భారతి మహేష్ ఆధ్వర్యంలో వార్డ్ సభ్యులు బుధవారం ఎంపిడిఓ, తహసీల్దార్ లకు ఫిర్యాదు చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అనధికారికంగా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.