బుగ్గారం మండలంలోని నాలుగు గ్రామాలకు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు అయినట్లు మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపీపీఎస్ శకల్ల, ఎంపీపీఎస్ వెలుగొండ, ఎంపీ యుపీఎస్ చిన్నాపూర్, ఎంపీ యూపీఎస్ గంగాపూర్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ మంజూరు అయినట్లు ఎంఈఓ తెలిపారు. ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ మంజూరు చేసినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాఠశాలల్లో ప్లే మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, వివిధ రకాల టిఎల్ఎం తో చిన్నారులకు బోధన అందించబడుతుందన్నారు.