జగిత్యాల జిల్లా, ధర్మపురిలో అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం నుండి లభించే సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారీ తిరుపతి మంగళవారం అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఎర్రకాటం మంగవ్వ నర్సింహ రెడ్డికి ప్రభుత్వం నుండి మంజూరు అయిన రెండు లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును పార్టీ కార్యాలయంలో లబ్ధిదారుకు అందజేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు.