ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మంత్రి బుధవారం పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.