రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు నియమితులైన ఎన్నికల జనరల్ అబ్సర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు శుక్రవారం ధర్మపురి మున్సిపాలిటీలో నామినేషన్ల సరళిని పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరూ ఎన్నికల నియమావళి మేరకు తమ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్ మధు సూదన్ కూడా పాల్గొన్నారు.