ధర్మపురి: నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి

ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రుల ముగింపు, జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్