ధర్మపురిలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం

జగిత్యాల జిల్లా, ధర్మపురి పురపాలక సంఘం ఆవరణలో మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని, పోలియో నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 100% నిర్మూలనకు చేరువలో ఉన్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ, రెండు చుక్కలు చిన్నారుల భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్