నిమజ్జన ఊరేగింపులో డీజే నిషేధం

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు, యువజన సంఘాలు, భక్తులకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో డీజే (DJ) సౌండ్ సిస్టం వినియోగం పూర్తిగా నిషేధించబడిందని, ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి డీజే లను ఏర్పాటు చేస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, డిజె సిస్టంలను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. డిజె సౌండ్ సిస్టం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రమాదమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕