జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి నుండి సూరారం వెళ్లే రహదారికి ఇరువైపులా కంప చెట్లు పెరిగి రోడ్డును కమ్మేస్తున్నాయి. ప్రధాన రహదారి వెంబడి ఉన్న ముళ్లచెట్లు, పిచ్చి మొక్కలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో రాత్రి సమయాల్లో ఆవి కనబడక ద్విచక్రవాహనాలపై వెళ్లే ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.