మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ, బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి భరోసా

జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం భీంరాజుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం, భూమయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు భూమయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్