మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కొప్పుల ఈశ్వర్

ధర్మపురి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వేద జ్యోతిష నిపుణులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాతృమూర్తి ఇటీవల పరమపదించిన సందర్భంగా శనివారం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోష్ కుమార్ శాస్త్రిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వొడ్నాల మల్లేషం, సంగిశేఖర్, మైపాల్ రెడ్డి, కార్తీక్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕