బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేసిన మంత్రి

జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం, గతంలో డాగ్ బైట్ కారణంగా మృతి చెందిన కోటిలింగాల గ్రామానికి చెందిన బాలుడు మంచికట్ల మణితేజ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వ తరఫున మంజూరైన రూ. 5 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్