ఉచిత రాగిజావ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, కేర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం పోషకాలు, విటమిన్లు అందించే రాగిజావను పేద కుటుంబాల పిల్లలు, విద్యార్థులకు ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమనీ, విద్యార్థులు పోషకాహారం తీసుకోని ఆరోగ్యంగా చదువుకోవాలన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕