పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని వెల్గటూర్ ఉమ్మడి మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. వైద్యాధికారులు డాక్టర్ లవకుమార్, డాక్టర్ తేజశ్రీ తెలిపిన వివరాల ప్రకారం, వెల్గటూర్ మండలంలో 2,647 మంది చిన్నారులకు గాను 2,571 మందికి (97.12%), ఎండపల్లిలో 2,451 మందికి గాను 2,404 మంది పిల్లలకు (98.1%) పోలియో చుక్కలు వేశారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో డోర్ టు డోర్ సర్వే ద్వారా చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా పూర్తయింది.

సంబంధిత పోస్ట్