పల్లె ప్రగతి పనులలో భాగంగా నిర్మించిన వెలగటూర్ సేగ్రేషన్ షెడ్డు నిరుపయోగంగా ఉంది. గ్రామాల్లో పోగైన చెత్తాచెదారాన్ని తడి, పొడిగా వేరుచేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేసే లక్ష్యంతో దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఇదే కాక చాలా గ్రామాల్లో చెత్త ఆయా షెడ్లకు చేరడం లేదు. సరైన మార్గంలో వీటిని వినియోగిస్తే కంపోస్ట్ ఎరువుగా మారి అన్నదాతకు భూసారం పెంపులో దోహదపడుతుంది అని గురువారం ప్రజలు తెలిపారు.