వెల్గటూర్: రోడ్డుపై కేజీ వీల్స్.. రోడ్డంతా గుంతలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకెనపల్లిలో రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఇలా రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు నడపటం వల్ల లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని ప్రమాదంగా మారుతున్నాయని వాపోయారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి ట్రాక్టర్ డ్రైవర్స్ కి అవగాహన కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్