ప్రపంచ పర్యాటక దినోత్సవం.. డ్రాయింగ్ లో ప్రథమ బహుమతి

ప్రపంచ పర్యాటక దినోత్సవం ను పురస్కరించుకొని మండల స్థాయిలో జరిగిన పోటీలో ZPHS కొత్తపేట పాఠశాల నుండి
నడిమెట్ల గాయత్రి ( 9వ తరగతి) డ్రాయింగ్ కాంపిటీషన్లో మొదటి బహుమతిని సాధించింది. కుషన పెళ్లి అక్షయ(9వ తరగతి) వ్యాసరచన పోటీలో రెండవ బహుమతిని సాధించింది. గంటాయి తేజస్విని (9వ తరగతి) ఉపన్యాస పోటీలో మూడవ బహుమతి సాధించింది. ఈ ముగ్గురు విద్యార్థులు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా సోమవారం రోజున ప్రశంసా పత్రాలను అందుకున్నారని కొత్తపేట zphs ప్రధానోపాధ్యాయులు రాజమణి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕