జగిత్యాల: క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

కొండగట్టులో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ఆలయ పరిసరాలను, దీక్షపరులు మాల విరమణ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్