జగిత్యాల: పరిగెత్తాడు.. ప్రాణం నిలిపాడు..!

జగిత్యాల పట్టణంలో ఎన్నికల విధుల్లోకి చేరే ముందు టీ తాగేందుకు వెళ్తున్న మున్సిపల్ ఉద్యోగి రాజేష్, శ్రీరామ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఆటోను ఢీకొన్న యాక్టివా వాహనం కిందపడటంతో అబ్బాయి, యువతితో పాటు చిన్న బాబు గాయపడ్డారు. సెంట్రల్ పోల్ దిమ్మెకు బాబు తల తగలడంతో మూర్చపోయాడు. గమనించిన రాజేష్ వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.

సంబంధిత పోస్ట్