జగిత్యాల: ‘కొండ సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలి’

శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు డిమాండ్ చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే పరిష్కరించుకోవాలని, దేవుళ్లను మధ్యలోకి తీసుకురావడం సరికాదని, కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని బాధిస్తున్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్