8 నెలల జీతాలు బకాయి: ఇంజనీర్లు, టెక్నీషియన్ల ఆవేదన

జగిత్యాల జిల్లాలో టి-ఫైబర్ అనుసంధానంతో పనిచేస్తున్న గ్లోబస్-ఐటీ సంస్థ ఇంజనీర్లు, టెక్నీషియన్లు గత 8 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీర్లకు రూ.2 లక్షలు, టెక్నీషియన్లకు రూ.1.5 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయని, ముందస్తు సమాచారం లేకుండా సంస్థ తప్పుకోవడంతో కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని తెలిపారు. మేనేజ్‌మెంట్ స్పందించకపోవడంతో, జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి బకాయిలు, సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల సిబ్బంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్