జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో 12 మంది ఉత్తమ ఎస్ జీ టీ. ఉపాధ్యాయులను గురువారo రోజున ఘనంగా సన్మానించారు. ఎస్ జీ టీ యూ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో శ్రీపతి రాఘవులు, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులను జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో రాణించడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి టి యూ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశం, అధ్యాపకులు పాల్గొన్నారు.