జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీజేపీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయడంలో విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకులు చిట్నేని రఘు శనివారం విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వెంటనే అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసి, వాటిలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కుటుంబాలకు బస్సు పాస్‌లు కూడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్