సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెంబట్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. బట్టపల్లిలో దిష్టిబొమ్మ దహనం, రేచపల్లిలో తెలంగాణతల్లి విగ్రహం వద్ద నినాదాలు, లచ్చక్కపేటలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బీర్ పూర్ మండల కేంద్రంలోనూ పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్