మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడిమ్యాల మోడల్ స్కూల్లో మధ్యాహ్నం "బేటీ బచావో బేటీ పడావో" కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మిషన్ కోఆర్డినేటర్ అశ్విని లింగ విద్య, లైంగిక వేధింపుల చట్టం 2013, మానసిక ఆరోగ్యం, ఋతుపరిశుభ్రత, సైబర్ నేరాలు, సఖి సేవలు, 1098, 181 వంటి హెల్ప్ లైన్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.