జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రెచపల్లిలో ఏదురుగట్ల సతీష్ (34) అనే యువకుడు శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం, మృతుడు గ్రామానికి చెందిన ఓ యువతి పట్ల వాట్సాప్ గ్రూపుల్లో దుష్ప్రచారం చేయడంతో, ఆ యువతి కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్