జేఎన్‌టీయూ నాచుపల్లిలో కెరీర్‌ గైడెన్స్‌ సదస్సు

జగిత్యాల జిల్లాలోని నాచుపల్లి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం ఏఐ యుగంలో కెరీర్‌కు సిద్ధం కావడం’పై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏటోస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ శ్రీనివాసరావు గుమ్మడవెల్లి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, విద్యార్థులు సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కార నైపుణ్యాలు, ప్రాజెక్టుల ప్రదర్శన, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, స్టేజ్‌ ఫియర్‌ను అధిగమించడం, లింక్డ్‌ఇన్‌ వినియోగంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕