జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రం నుండి గుడిపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న చెరువు కట్ట అశుభ్రంగా మారడంతో, స్థానికులు మల, మూత్ర విసర్జనలు, చెత్త డంపింగ్ తో దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై స్పందించిన మల్యాల గ్రామ పంచాయితీ అధికారులు, సిబ్బంది చెరువు కట్టను బుధవారం శుభ్రం చేసి, మట్టితో పూడ్చివేసే పనులు చేపట్టారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.