జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రం నుండి గుడిపేట గ్రామానికి వెళ్లే దారిలో చెరువు కట్ట అశుభ్రంగా మారింది. అక్కడ స్థానికులు మల, మూత్ర విసర్జనల వలన దుర్వాసన వెదజల్లుతుంది. కట్టా పక్కన లోతోట్టు ప్రాంతంలో చెత్తను డంపింగ్ చేయడంతో స్థానికులు అనారోగ్యం గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మల్యాల గ్రామ పంచాయితీ అధికారులు సిబ్బందిచే మట్టిని తీసుకొచ్చి పూడ్చి శుభ్రం చేపిస్తున్నారు.