రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్లీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జగిత్యాల తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ రూరల్, అర్బన్ క్యాడర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి' అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.