జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పాఠశాల వయస్సు పిల్లలందరూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలనే లక్ష్యంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు శేషశలపతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్య ప్రాముఖ్యతను వివరించారు.