రైతు వినూత్న ఆవిష్కరణ: మొబైల్ తో మోటార్ ఆన్-ఆఫ్

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఒక రైతు తన వ్యవసాయ బావి మోటారును మొబైల్ ఫోన్ సహాయంతో ఆపరేట్ చేసే వినూత్న పద్ధతిని ఆవిష్కరించాడు. దీని ద్వారా ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. విద్యుత్ సరఫరా వివరాలు, ఫ్యూజ్ పోయినప్పుడు సమాచారం, టైమర్ సెట్టింగ్స్ ద్వారా మోటారును నియంత్రించే సౌకర్యం ఉందని మంగళవారం రైతు తెలిపారు. ఈ సాంకేతికత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్