బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో పండ్ల పంపిణీ, టీచర్లకు సన్మానం

జగిత్యాలలోని 12వ వార్డు అంగన్వాడి కేంద్రంలో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో 'అంగన్ మిలన్ సేవా' కార్యక్రమంలో భాగంగా పండ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ కార్యదర్శి గడ్డల లక్ష్మి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు మాతా శిశు సంక్షేమం కోసం కృషి చేస్తున్న అంగన్వాడి టీచర్లను సన్మానించినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్లను సన్మానించి, పండ్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕