రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 86 స్థానాల్లో గెలుపు: టీ.జీవన్ రెడ్డి

రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 118 స్థానాల్లో 86 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి అన్నారు. వేములవాడలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని తెలిపారు. కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్