జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి పద్మ-నరేష్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ఆదివారం స్థానిక సర్పంచ్ ఓరగల అరుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసవేణి కుమార్, రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.