జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం గ్రామస్తులను ఆకట్టుకుంది. 9 రోజులు గణపయ్యకు పూజలు నిర్వహించిన చిన్నారులు, ఎలాంటి డీజే చప్పుళ్ళు లేకుండా, గణపయ్యను సైకిల్ పై పెట్టుకొని, డప్పులు కొట్టుకుంటూ వెళ్లి నిమజ్జనం చేశారు.