జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. నదిలో ఇసుక మేటలు బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలపైనే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ ఆధారపడి ఉన్నందున, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్థులు భావిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవకపోతే గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రభావం పడే ముప్పు ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.