జంతు సంక్షేమ పక్షోత్సవం సందర్భంగా జగిత్యాల పురానిపేట జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. ప్రకాష్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 14 నుండి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఈ పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. మదన్ మోహన్ కూడా పాల్గొన్నారు.