జగిత్యాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేశ్, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 5 నెలల శిక్షణతో పాటు వసతి, పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తారు. మరిన్ని వివరాలకు 6303554770 నంబర్‌కు సంప్రదించవచ్చు.