ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యాలలోని పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తను ఊడ్చి, పిచ్చి మొక్కలను తొలగించి తరగతి గదులను శుభ్రపరిచారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పాఠశాలలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది అని కౌన్సిలర్ అరవ లక్ష్మి పేర్కొన్నారు.