జగిత్యాల: సమాధి నిర్మించుకున్న ఇంద్రయ్య మృతి పట్ల సంతాపం

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో బతికుండగానే తన సమాధిని నిర్మించుకున్న సీనియర్ సిటిజన్స్ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం ఆయన తన 5 గుంటల స్థలంలో కట్టుకున్న సమాధిలోనే భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్