తల్లిదండ్రులను పోషించని కొడుకులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. సోమవారం, జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి, గొల్లపల్లి మండలాల నుండి వచ్చిన కొడుకులు తమ తల్లిదండ్రులను పోషిస్తామని, వారి బాగోగులు చూసుకుంటామని ఒప్పంద పత్రాలు సమర్పించి, తల్లిదండ్రులను వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కౌన్సిలింగ్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.