జగిత్యాల: పూసల సంఘ భవన స్థలం ఏర్పాటుకు కృషి

జగిత్యాల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి, జిల్లా పట్టణంలో పూసల సంఘ భవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, స్థలం ఏర్పాటు విషయంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నీర్ సతీష్, అధ్యక్షులు ముద్రకొల్ల శ్యామ్, ప్రధాన కార్యదర్శి మద్దినేని మురళి, కోశాధికారి మర్రి రాము, మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్