జగిత్యాల: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి అడ్లూరి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో రబీ ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర నిబంధనల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తూకం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, మిల్లర్లు సహకరించాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్