జగిత్యాల: ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి ఆహ్వానం

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ను బుధవారం మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం కలిసి, ఈ నెల 12న ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం పోస్టర్‌ను అందజేశారు. శిబిరానికి మున్సిపల్ సిబ్బంది, కార్మికులను పంపాలని వైద్యులు కోరారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి, ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చని వైద్యులు తెలిపారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్