జగిత్యాల: రాష్ట్రపతి అవార్డు గ్రహీతను అభినందించిన ఎమ్మెల్యే

వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లికి చెందిన మని సాయి వర్మను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. సాయి వర్మ ఇటీవల ఢిల్లీలోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా, అవార్డు గ్రహీత మని సాయి వర్మ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికలో సాయి వర్మ తన అవార్డు అందుకున్న అనుభవాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్