జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామంలో రూ. 10 లక్షలతో, కల్లెడ గ్రామంలో రూ. 20 లక్షలతో రెండు మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, డీఈ, ఎంపీవోలు పాల్గొన్నారు. ఈ భవనాల నిర్మాణం మహిళా సంఘాల కార్యకలాపాలకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.