జగిత్యాల: నెల రోజులు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలిసి ఆయన ఈ మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎంవిఐ ప్రమీల, రవాణా శాఖ మెంబర్ శ్రీనివాస్, మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్